IND vs AUS WTC Final : భారత్ పోరాటం ఆస్ట్రేలియా ఆధిక్యం
తప్పిన ఫాలో ఆన్ గండం
IND vs AUS WTC Final : ఇంగ్లండ్ లోని ఓవెల్ మైదానం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(IND vs AUS WTC Final) మ్యాచ్ రసవత్తరంగా మారింది. 18 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అజింక్యా రహానే అద్భతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక దశలో భారత్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆసిస్ బౌలర్ల ధాటికి వికెట్లు కోల్పోయిన భారత్ ను ఆదుకున్నారు రవీంద్ర జడేజా , అజింక్యా రహానే. ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో ధాటిగా ఆడాడు జడేజా. 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 48 పరుగులు చేసి ఔటయ్యాడు.
అనంతరం శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. 51 రన్స్ చేశాడు. కష్టాల్లో ఉన్న భారత్ ను గట్టెక్కించిన అజింక్యా రహానే 89 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రహానే, ఠాకూర్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరకు భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. ఇక మ్యాచ్ పరంగా చూస్తే మొదటి, రెండు రోజుల్లో భారత్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక మూడో రోజు భారత్ కాస్తా పోరాట పటిమను ప్రదర్శించింది. మూడు కీలక వికెట్లు తీసింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లో ఆదుకున్న డేవిడ్ వార్నర్ కేవలం రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 122 రన్స్ చేసింది. ఇప్పటి దాకా 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబుషేన్ 41 రన్స్ చేస్తే కామెరూన్ గ్రీన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. జడేజా 2 వికెట్లు తీస్తే సిరాజ్, యాదవ్ చెరో వికెట్ తీశారు.
Also Read : Balakrishna Birth Day : బాలయ్యా కలకాలం వర్ధిల్లు