Balakrishna Birth Day : బాల‌య్యా క‌ల‌కాలం వ‌ర్ధిల్లు

జూన్ 10న నంద‌మూరి పుట్టిన రోజు

Balakrishna Birth Day : తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. దివంగ‌త న‌ట సార్వభౌముడు నంద‌మూరి తార‌క రామారావు త‌న‌యుడు. న‌ట‌నా ప‌రంగా తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న అరుదైన న‌టుడు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. జూన్ 10, 1960లో ఏపీలో పుట్టారు. జీవిత భాగ‌స్వామి వ‌సంధుర‌. కూతుళ్లు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని, అల్లుడు నారా లోకేష్. మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడి కొడుకు. ప్ర‌స్తుతం టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నారు. కుమారుడు తార‌క రామ తేజ మోక్ష‌జ్ఞ‌. త‌ల్లి బ‌స‌వ‌తారకం. ఆమె స్మృత్య‌ర్థం హైద‌రాబాద్ లో క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ఏర్పాటు చేశారు.

నంద‌మూరి బాల‌కృష్ణ(Nandamuri Balakrishna) న‌టుడే కాదు ప్ర‌యోక్త కూడా. నిర్మాత‌, టీడీపీ శాస‌న‌స‌భ స‌భ్యుడు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌డంలో త‌న‌కు తానే సాటి. పౌరాణిక‌, సాంఘిక‌, జాన‌ప‌ద చిత్రాల‌లో న‌టించి మెప్పించిన చ‌రిత్ర ఆయ‌న‌ది. బాల‌కృష్ణ‌ను అంద‌రూ బాల‌య్యా అని ముద్దుగా పిలుచుకుంటారు. బాల్య‌మంతా హైద‌రాబాద్ లోనే జ‌రిగింది. 14 ఏళ్ల వ‌య‌సులో 1974లో త‌న తండ్రి ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాతమ్మ క‌ల చిత్రంలో తొలిసారిగా న‌టించాడు. తొలుత వివిధ సినిమాల్లో స‌హాయ న‌టుడిగా న‌టించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు 108 సినిమాల‌లో చేసిన బాల‌కృష్ణ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెలుగు వార‌న్నా, సంస్కృతి, సాంప్ర‌దాయాల‌న్నా , సాహిత్య‌మ‌న్నా ఇష్టం. పుట్టిన రోజు సంద‌ర్భంగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌గ‌వంత్ కేస‌రి మూవీలో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేశారు. 1984లో సాహ‌జ‌మే జీవితం అనే చిత్రంలో హీరోగా న‌టించిన బాల‌కృష్ణ(Balakrishna) ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు. డైలాగ్ డెలివ‌రీలో , రౌద్రాన్ని పండించడంలో అంద‌రికంటే ముందున్నాడు. 2019లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎన్టీఆర్ బ‌యోగ్ర‌ఫీలో మ‌హానాయ‌కుడిగా న‌టించాడు. 62 ఏళ్లు దాటినా ఇంకా యువ న‌టుల‌తో పోటీ ప‌డుతున్నాడు బాల‌య్య‌. ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.

Also Read : Varun Tej Lavanya Engagement : వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య నిశ్చితార్థం

Leave A Reply

Your Email Id will not be published!