Varun Tej Lavanya Engagement : వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య నిశ్చితార్థం

కొణిదెల నాగ‌బాబు నివాసంలో కార్య‌క్రమం

Varun Tej Lavanya Engagement : తెలుగు సినిమా రంగంలో మిస్ట‌ర్ కూల్ బాయ్ గా పేరు పొందిన వ‌రుణ్ తేజ్(Varun Tej) , అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైద‌రాబాద్ మ‌నికొండ లోని కొణిదెల నాగబాబు నివాసంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ శుభ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత‌లు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబీకులు, అత్యంత స‌న్నిహితులు విచ్చేశారు. త‌మ ఇంట జ‌రుగుతున్న వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ , ఉపాస‌న , అల్లు అర్జున్ , అల్లు అర‌వింద్ , సురేఖ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా న‌టుడు వ‌రుణ్ తేజ్ , న‌టి లావ‌ణ్య త్రిపాఠిల నిశ్చితార్థం సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలియ చేశారు. కొణిదెల నాగ బాబు దంప‌తులు , మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంప‌తులు కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. ఇదిలా ఉండ‌గా వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిలు ఇద్ద‌రూ ఒక ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రూ క‌లిసి అంత‌రిక్షం అనే చిత్రంలో క‌లిసి న‌టించారు.

ఇటీవ‌లే పారిస్ కు వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో కెమెరాల‌కు చిక్కారు. ఇక వ‌రుణ్ తేజ్ , సాయి ప‌ల్ల‌వి న‌టించిన శేఖ‌ర్ క‌మ్ముల తీసిన ఫిదా అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌న కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మాత్రం దిల్ రాజు నిర్మాణంలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తీసిన ఎఫ్-2 మూవీ.

Also Read : Ajinkya Rahane Comment : మాన‌ని గాయం సక్సెస్ కు సోపానం

Leave A Reply

Your Email Id will not be published!