IND vs AUS WTC Final : గట్టెక్కించిన రహానే..ఠాకూర్
రీ ఎంట్రీతో ఆకట్టుకున్న అజింక్యా
IND vs AUS WTC Final : ఫామ్ లేదన్న కారణంతో పక్కకు నెట్టేయబడిన క్లాసిక్ ప్లేయర్ అజింక్యా రహానే ఉన్నట్టుండి జూలు విదిల్చాడు. ఐపీఎల్ 2023 పుణ్యమా అంటూ దుమ్ము రేపాడు. ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజయాలలో ముఖ్య భూమిక పోషించాడు. బీసీసీఐ దృష్టిని ఆకర్షించాడు. తన సహజ సిద్దమైన ఆట తీరుకు భిన్నంగా దూకుడు పెంచాడు. కానీ బాధ్యతను మరిచి పోలేదు.
వరల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(IND vs AUS WTC Final) లో ఇంగ్లండ్ లోని ఓవల్ లో అతిరథ మహారథులు పెవిలియన్ దారి పడితే గౌరవ ప్రదమైన స్కోర్ పెంచేలా చేశాడు రహానే. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో ఆచి తూచి ఆడాడు. ఓ వైపు రవీంద్ర జడేజా రెచ్చి పోతే తను మాత్రం కూల్ గా ఆడుకుంటూ పోయాడు.
18 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఏ మాత్రం తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 89 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారత జట్టును ఫాలో ఆన్ ఉపద్రవం నుంచి గట్టెక్కించాడు. శార్దూల్ ఠాకూర్ 51 రన్స్ చేసి దుమ్ము రేపితే , రహానే మాత్రం సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
మొత్తంగా రహానే రాక ఒకింత భారత జట్టుకు బలంగా మారిందనడంలో సందేహం లేదు. కడపటి వార్తలు అందేసరికి భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ 2 , కమిన్స్ 3 , స్కాట్ 2 , గ్రీన్ 2, లేమాన్ 1 వికెట్ తీశారు.
Also Read : V Srinivas Goud : 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం