India ICC World Cup 1983 : చరిత్రాత్మకం చిరస్మరణీయం
1983 వరల్డ్ కప్ కపిల్ డెవిల్స్
India ICC World Cup 1983 : భారత దేశ క్రీడా చరిత్రను మలుపు తిప్పిన సన్నివేశం. కోట్లాది మంది భారతీయులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన క్షణం. అరుదైన విజయం అద్బుత సన్నివేశానికి వేదికైంది 1983 క్రికెట్ వరల్డ్ కప్(India ICC World Cup 1983). అండర్ డాగ్స్ గా ఎంట్రీ ఇచ్చి డేర్ డెవిల్స్ గా ప్రపంచానికి చాటి చెప్పిన వైనం చిరస్థాయిగా నిలిచి పోతుంది. హర్యానా హరి కేన్ కపిల్ దేవ్ నిఖంజ్ సారథ్యంలో టీమిండియా చిరస్మనీయమైన గెలుపును అందుకుంది. ఈ సక్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత క్రికెట్ రంగాన్ని సమూలంగా మార్చేసిన ఘనత కపిల్ దేవ్ కు దక్కుతుంది. ఆల్ రౌండర్ గా పేరు పొందిన ఈ క్రికెటర్ నాయకుడిగా, విజేతగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఫైనల్ మ్యాచ్. ప్రత్యర్థి జట్టులో అందరూ దిగ్గజాలే. వారికి భారత క్రికెటర్లు చుక్కలు చూపించారు. తమకు ఎదురే లేదని చాటారు. ఇదే సమయంలో ఈ ఏడాదికి ప్రత్యేకత ఉంది.
ఎందుకంటే ప్రపంచ కప్ గెలుపొంది సరిగ్గా 40 ఏళ్లవుతోంది. చూస్తూ ఉండగానే ఇన్నేళ్లు గడిచి పోయాయి. కానీ కోట్లాది కళ్ల ముందు ఆ అద్భుత సన్నివేశం ఇంకా కదలాడుతూనే ఉంది. కప్ ను అందుకున్న కపిల్ దేవ్ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ప్రపంచం జేజేలు పలికింది. యావత్ భారత గుండెలన్నీ జయహో భారత్ అంటూ నినదించింది. ఆనాడు సాధించిన ఆ విజయం నేటికీ పదిలంగా ఉంది. క్రికెట్(Cricket) అంటే ఆట కాదని అది ఒక మతం అని, దేశానికి సంబంధించిన గౌరవమని, అంతకు మించిన పరువుతో కూడుకున్న అంశమని చాటి చెప్పారు ఆటగాళ్లు. ఆ విక్టరీ ప్రయాణంలో పాలు పంచుకున్న క్రికెటర్లు ఇప్పటికీ మన కళ్ల ముందే ఉన్నారు. వాళ్లకు ఈ దేశం రుణపడి ఉంది. ఎందుకంటే 1983 అనేది భారత క్రీడా రంగానికి ప్రాణం పోసేలా చేసింది. సువర్ణ అక్షరాలతో లిఖించ దగింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత కపిల్ దేవ్ సేనకు దక్కుతుంది.
క్రికెట్ జర్నీని మరింత సులభతరం చేసినందుకు యావత్ భారతావని రుణపడి ఉంది. లార్డ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కరేబియన్ జట్టును ఓడించి విశ్వ విజేతగా నిలవడం ఇప్పటికీ కదలాడుతూనే ఉంది. ఆనాటి నుంచి నేటి దాకా క్రికెట్(Cricket) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆట స్వరూపమే పూర్తిగా మారి పోయింది. లాయిడ్ విండీస్ గెలుస్తుందని అంచనా వేశాడు. ఎందుకంటే ఆ జట్టు క్రికెట్ లో ఆధిపత్యాన్ని కలిగి ఉంది. కానీ భారత జట్టు కలిసికట్టుగా రాణించింది. ప్రత్యర్థి టీమ్ ను బోల్తా కొట్టించింది. ఇదే వరల్డ్ కప్ లో జట్టు సారథి కపిల్ దేవ్ 175 పరుగులు ఎల్లప్పటికీ గుర్తుండి పోతుంది. అవును భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన సమయంలో కళ్లారా చూసిన వాళ్లు నేటికీ ఉన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. భారత జట్టు ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు. కానీ ఈ గెలుపులన్నింటికీ ఒకటే కారణం అది కపిల్ దేవ్ సేన సృష్టించిన ప్రభంజనం అని చెప్పక తప్పదు.
Also Read : CM Siddaramaiah : యడ్యూరప్పపై సిద్దరామయ్య కన్నెర్ర
