India Ranks 127 : లింగ సమానత్వంలో ఇండియా పూర్
గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023
India Ranks 127 : భారత దేశానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, మాఫియా డాన్ లు, ఆర్థిక నేరగాళ్లకు కేరాఫ్ గా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా గ్లోబల్ జెండర్ సంస్థ నివేదిక తయారు చేస్తుంది. ఈ ఏడాది 2023కి సంబంధించి నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో కోలుకోలేని రీతిలో భారత్ ర్యాంకు మరింత వెనుకలోనే ఉండడం విశేషం.
ప్రత్యేకించి లింగ సమానత్వంలో 146 దేశాలలో సర్వే చేస్తే భారత దేశం 127వ స్థానంలో ఉందని పేర్కొంది. గత ఏడాది నుండి 8 స్థానాలు పైకి జారింది. ఇక లింగ సమానత్వం (స్త్రీ, పురుషుడు) పరంగా చూస్తే విద్యలో కొంచెం మెరుగ్గా ఉన్నారు. కానీ ఆర్థిక భాగస్వామ్యంలో 36.7 శాతం మాత్రమే సమానత్వం కలిగి ఉండడం విశేషం.
ఇక చట్టాలు చేసే పార్లమెంట్ ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15.1 శాతంగా ఉంది. ఇక ఆరోగ్యం, మనుగడ అంతరం మాత్రం 92.7 శాతంగా ఉండడం శుభ పరిణామం. ఇదిలా ఉండగా భారత దేశంలో(India Ranks) మొత్తం లింగ వ్యత్యాసాన్ని రూపు మాపాలంటే, లేకుండా చేయాలంటే కనీసం 131 సంవత్సరాలు పడుతుందని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు పేర్కొంది. మొత్తంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ప్రధాన మంత్రి బీజేపీ సంకీర్ణ సర్కార్ పనితీరును ఇది అద్దం పడుతుంది.
Also Read : CM Siddaramaiah : బియ్యానికి బదులు నగదు – సీఎం