Indian Govt Ban : ఎలక్ట్రానిక్..డిజిటల్ మీడియా జాగ్రత్త
హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
Indian Govt Ban : న్యూఢిల్లీ – దేశంలోని ఎలక్ట్రానిక్ , డిజిటల్ మీడియా (ప్రచురణ, ప్రసార, సామాజిక మాధ్యమాల) కు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు తాజాగా సంచలన కామెంట్స్ చేసింది కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ సర్కార్. గత కొంత కాలంగా తమ ఇష్టానుసారంగా ఏది పడితే అది ప్రసారం చేస్తూ, పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తున్నారంటూ మండిపడింది.
Indian Govt Ban Viral
ఇప్పటికే సమాచార, ఐటీ మంత్రిత్వ శాఖలు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను రూపొందించాయి. వీటన్నింటిని ఈ దేశంలో నిర్వహిస్తున్న ప్రచురణ, ప్రసార, డిజిటల్ మీడియా సంస్థలు వస్తాయని స్పష్టం చేసింది కేంద్రం.
ఇందుకు సంబంధించి కీలక సూచనలు చేసింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదం, నిషేధించిన సంస్థలకు చెందిన వారితో సహా అటువంటి నేపథ్యం కలిగిన వ్యక్తుల నుంచి నివేదికలు, సూచనలు, వీక్షణలు , ఇంటర్వ్యూలు చేయడం పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొంది.
భారత(India) రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించబడిన సహేతుకమైన పరిమితులకు సంబంధించి, సీటీఎన్ చట్టం లోని సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ (2) కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read : Mohammed Shami Comment : షమీ షాన్ దార్ ఆట జోర్దార్