Sonu Nigam Manhandled : కచేరిలో సోనూ నిగమ్ తోసివేత
పోలీసులకు ఫిర్యాదు చేసిన సింగర్
Sonu Nigam Manhandled : ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముంబై వేదికగా జరిగిన సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సింగర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైవ్ కన్సర్ట్ లో గాయకుడి పట్ల ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. సహాయకుడు స్టేజి పైకి నెట్టి వేయడం కలకలం రేపింది. గత రాత్రి ఇది జరిగింది. మ్యూజిక్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు ముంబైలో. ఇందులో లైవ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు సోనూ నిగమ్.
ఈ కార్యక్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు ఒప్పుకోలేదు గాయకుడు. దీంతో సింగర్ దాడికి గురయ్యాడు. అతడి సహాయకుల్లో ఒకరిని వేదికపై నుంచి తోసి వేశారు. చెంబూరులో రాత్రి 11 గంటలకు సోనూ నిగమ్(Sonu Nigam Manhandled) తన ప్రత్యక్ష ప్రదర్శన తర్వాత వేదికపైకి ఎక్కుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన అతడి సహాయకుడు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్నాడని, డిశ్చార్జ్ కూడా అయినట్లు పేర్కొన్నారు.
నన్ను నెట్టడంతో నేను మెట్ల పై పడి పోయాను. రబ్బానీ నన్ను రక్షించేందుకు వచ్చి వెనుక నుండి తోసి వేయబడడ్ఆడు. ప్రజలు సెల్ఫీ కోసం ఎవరినైనా బలవంతం చేసినప్పుడు దాని గురించి ఆలోచించాలి. కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు గాయకుడు సోనూ నిగమ్. ఇదిలా ఉండగా నిందితుడిని స్వప్నిల్ ఫాటర్ పేకర్ గా గుర్తించినట్లు తెలిపారు డీసీపీ హేమ్ రాజజ్ సింగ్ రాజ్ పుత్. కేవలం సెల్ఫీ కోసమే ఇది జరిగిందని పేర్కొన్నారు.
Also Read : మెటా సబ్ స్క్రిప్షన్ సర్వీస్ స్టార్ట్