TSPSC : గ్రూప్ -1 గందరగోళంపై విచారణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన
TSPSC : లక్షలాది మంది ఎంతో ఆశతో పరీక్షకు హాజరైన గ్రూప్ -1 ప్రిలిమినరీకి సంబంధించి పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. పరీక్ష సరైన సమయానికి నిర్వహించకుండా ఆలస్యంగా నిర్వహించారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు(TSPSC) చైర్మన్ గా నియమితులైన జనార్దన్ రెడ్డి చిలుక పలుకులు పలుకుతూ వచ్చారు. పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి పైరవీలకు తావు ఉండదని స్పష్టం చేశారు. కష్టపడి చదువు కోవాలని మధ్య దళారీలను నమ్మవద్దని కోరారు.
ఈ తరుణంలో పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న గందరగోళం ఇప్పుడు తీవ్ర వివాదానికి , చర్చకు దారి తీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఎస్ కేంద్రంలో తెలుగుకు బదులు ఉర్దూ పేపర్ ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన చేపట్టడం వైరల్ గా మారింది. మధ్యాహ్నం తర్వాత పరీక్ష చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈనెల 16న ఉదయం 10.30 గంటలకు చేపట్టాల్సిన పరీక్షను మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్ష చేపట్టినట్లు నిర్ధారణ జరిగిందని సమాచారం. దీనిపై టీఎస్పీఎస్సీ కార్యదర్శి , కలెక్టర్ అమేయ కుమార్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రిలిమినరీ పరీక్ష ఆలస్యం కావడంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు చైర్మన్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
Also Read : మోదీ లిజ్ ట్రస్ ను చూసి నేర్చుకో – కేటీఆర్