కోచ్ లు, కెప్టెన్ల‌పై ఐపీఎల్ జ‌ట్ల యాజ‌మాన్యాలు ఫోక‌స్

ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ కేపిట‌ల్స్, కేకేఆర్, ఎంఐ జ‌ట్లు

హైద‌రాబాద్ : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2027లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి . ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 10 జ‌ట్లు ఆడుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈసారి జ‌ర‌గ‌బోయే బీసీసీఐ ఐపీఎల్ మెగా టోర్నీలో ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన యాజ‌మాన్యాలు పూర్ ప‌ర్ ఫార్మెన్స్ క‌న‌బ‌ర్చిన ఆట‌గాళ్ల‌పై వేటు వేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్ప‌టికే ఆర్సీబీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హెడ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్ ను త‌ప్పించ‌నుంది. త‌న స్థానంలో కోహ్లీ సూచ‌న మేర‌కు భార‌త జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి ని నియ‌మించ‌నున్న‌ట్లు టాక్. జ‌ట్ల కెప్టెన్లు, కోచ్ లు కూడా మార‌నున్నారు దీనిని బ‌ట్టి చూస్తే. ఇక జ‌ట్ల వారీగా చూస్తే కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఫోక‌స్ పెట్టాయి ఆయా ఐపీఎల్ జ‌ట్ల మేనేజ్మెంట్లు.

ముంబై ఇండియన్స్ జట్టు విష‌యానికి వ‌స్తే తిలక్ వర్మ కెప్టెన్ గా బలమైన అంతర్గత ఎంపికగా కనిపిస్తుండటంతో ప్ర‌స్తుతం స్కిప్ప‌ర్ గా ఉన్న‌ హార్దిక్ పాండ్యా భవిష్యత్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక ఆర్సీబీ విష‌యానికి వ‌స్తే కోచ్ ను మార్చ‌వ‌చ్చు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తీసుకునే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ విష‌యానికి వ‌స్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకి గట్టి పరీక్ష ఎదురు కావచ్చు, అదే సమయంలో ఫ్రాంచైజీ మార్కెట్లో అనుభవజ్ఞులైన వికెట్ కీపర్-బ్యాటర్ ను ఎంపిక చేసేందుకు రెడీ అయ్యారు. త‌న స్థానంలో సంజు శాంస‌న్ ను నియ‌మించేందుకు ఆస్కారం ఉంది.

ఈసారి ఐపీఎల్ లో భారీ ధ‌ర ప‌లికిన రిష‌బ్ పంత్ పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌న‌ను త‌ప్పించ‌నుంది. త‌న స్థానంలో బారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు సంబంధించి అక్ష‌ర్ ప‌టేల్ త‌న కెప్టెన్సీ కోల్పోనున్నాడు. త‌న స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు ప్ర‌స్తుతం అజింక్యా ర‌హానే కెప్టెన్ గా ఉన్నాడు. త‌న స్థానంలో ఇంకొక‌రిని ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) టీంలో పాట్ కమిన్స్ అంతర్జాతీయ మ్యాచ్‌ల పనిభారం చర్చలకు దారి తీయవచ్చు, కాగా ఇషాన్ కిషన్ భవిష్యత్తులో ఫ్రాంచైజీ కీలక వ్యక్తులలో ఒకరిగా మారవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జ‌ట్టులో శ్రేయస్ అయ్యర్‌పై భారీ ఒత్తిడి ఉంటుంది. ఫలితాలు మెరుగు పడకపోతే ఫ్రాంచైజీ తన ప్రధాన బృందం గురించి పునరాలోచించవచ్చు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే రియాన్ ప‌రాగ్ తన ప్లేస్ కోల్పోవ‌చ్చు. త‌న‌కు బ‌దులు జైశ్వాల్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

Leave A Reply

Your Email Id will not be published!