IT Raids : తమిళ నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లపై ఐటీ దాడులు
కోలివుడ్ ను షాక్ గురి చేస్తున్న దాడుల పరంపర
IT Raids : దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులతో బిజీగా మారాయి. సీబీఐ, ఐటీ, ఈడీ, ఐఎన్ఐ ఇలా ప్రతి సంస్థ దేశ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ సోదాలు, దర్యాప్తులు ముమ్మరం చేశాయి.
ఇక వీటిని అధికార పక్షం సూచనల మేరకే తమపై ప్రయోగిస్తున్నాయంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. కానీ అధికారంలో కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం తమకు సంబంధం లేదంటూ బుకాయిస్తోంది.
ఏది ఏమైనా దేశంలో ఎక్కువగా గ్లామర్ కలిగి ఉన్న రంగాలలో సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలు. తాజాగా ఆదాయ పన్ను శాఖ కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది కోలీవుడ్ ఇండస్ట్రీకి.
తమిళ చిత్ర పరిశ్రమతో ముడిపడి ఉన్న బిగ్ షాట్స్ పై కన్నేసింది. ఆ మేరకు మంగళవారం ఐటీ ఉన్నట్టుండి రంగంలోకి దిగింది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో పేరుఒందిన కలైపులి థాను, ఎస్. ఆర్. ప్రభు, అన్ను చెజియన్ , జ్ఞానవేల్ రాజా దాదాపు 10 మంది సినీ నిర్మాతలు, పంపిణీదారుల (డిస్ట్రిబ్యూటర్లు) కు సంబంధించిన ప్రాంగణాల్లో దాడులు చేపట్టింది ఐటీ శాఖ(IT Raids).
ఇవాళ ఉదయం 6 గంటల నుంచే సోదాలు ప్రారంభించంది. పెద్ద ఎత్తున పత్రాలు, ఇతర వాటికి సంబంధించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ దాడులు, సోదాలకు సంబంధించి ఐటీ శాఖ బయటకు వెల్లడించ లేదు.
కొందరు తమిళ సినీ నిర్మాతలు, పంపిణీదారులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో తమిళనాడు లోని 40కి పైగా ప్రాంతాలలో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఐటీ రైడ్స్ తో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది.
Also Read : శివుడి సాంగ్ పై గుస్సా సింగర్ పై ఫత్వా