Jayaraj Selected : జయరాజ్ కు కాళోజీ పురస్కారం
కవి, రచయిత..గాయకుడిగా గుర్తింపు
Jayaraj Selected : హైదరాబాద్ – ప్రముఖ కవి, రచయిత, గాయకుడు జయరాజ్ కు అరుదైన పురస్కారం లభించింది. పద్మ విభూషణ్ ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరు మీద ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. కాళోఈ నారాయణ రావు అవార్డును ఈ ఏడాది 2023 సంవత్సరానికి గాను కవి జయరాజ్ ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Jayaraj Selected For Padmabushan Award
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర సర్కార్ ను కమిటీని నియమించింది. ఈ మేరకు కమిటీ సిఫారసుల మేరకు ఈసారి జయరాజ్ ను ఎంపిక చేశారు(Jayaraj Selected). ఇదిలా ఉండగా సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి. ఈ సందర్బంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్ కు కాళోజీ పురస్కారం అందజేస్తారు.
కవి, రచయిత, గాయకుడు జయరాజ్ కు 60 ఏళ్లు. ఆయన స్వస్థలం మహబూబాద్ జిల్లా. ఎన్నో కష్టాలను చవి చూశారు, దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ సమ సమాజం కోసం ఆక్రోశించాడు. తన కలాన్ని, గొంతును ప్రజల కోసం అంకితం చేశాడు.
బుద్దుని బోధనల పట్ల ప్రభావితం అయ్యాడు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలకు ఆకర్షితుడయ్యాడు. ప్రకృతి, పర్యావరణ కవిగా , తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : Anurag Thakur : ఇండియా పేరు మార్చం – ఠాకూర్