JEE Main 2023 : జేఈఈ మెయిన్ నోటిఫికేష‌న్ రిలీజ్

రెండు విడ‌త‌లుగా దేశ‌మంత‌టా ప‌రీక్ష

JEE Main 2023 : ల‌క్ష‌లాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న క్ష‌ణం రానే వ‌చ్చింది. వ‌చ్చే ఏడాదిలో నిర్వ‌హించే జేఈఈ మెయిన్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేర‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) ప‌రీక్ష‌కు సంబంధించి నోటిఫికేష‌న్ ను రిలీజ్ చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు సంబంధిత వెబ్ సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష 2023లో(JEE Main 2023) రెండు విడ‌త‌లుగా జ‌రుగుతుంది. మొదటి సెష‌న్ ఎగ్జామ్ జ‌న‌వ‌రిలో , రెండో సెష‌న్ ప‌రీక్ష ఏప్రిల్ లో ఉంటుంది. తొలి విడ‌త ప‌రీక్ష జ‌న‌వ‌రి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వ‌హిస్తారు. రెండో సెష‌న్ ప‌రీక్ష‌ను ఏప్రిల్ నెల 6,8,10,11,12 తేదీల్లో చేప‌డ‌తారు.

దేశంలోని 13 భాష‌ల‌లో జేఈఈ ప‌రీక్ష ఉంటుంది. ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా పోటీ ఉండ‌డం స‌ర్వ సాధార‌ణంగా మారింది. ఇక ఎగ్జామ్ కు సంబంధించి రాసే అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 15 నుంచి జ‌న‌వ‌రి 12న లోపు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు వీలు క‌ల్పించింది.

ప‌రీక్ష ద‌ర‌ఖాస్తుతో పాటు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్(JEE Main 2023) ఎగ్జామ్ ను రెండు పేప‌ర్లు నిర్వ‌హిస్తారు. మొద‌టి పేప‌ర్ బీఈ, బీటెక్ కోర్సుల‌కు సంబంధించి కాగా రెండో పేప‌ర్ బీఆర్క్ , బీ ప్లానింగ్ కోర్సుల‌కు సంబంధించింది. ఇక జేఈఈ మెయిన్ సెష‌న్ రెండో ప‌రీక్ష‌కు ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 7 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏమైనా సందేహాలు ఉన్న‌ట్ల‌యితే అధికారిక వెబ్ సైట్ ద్వారా అనుమానాలు నివృత్తి చేసుకునే వీలుంది.

Also Read : గ్రూప్ – 4 పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ జెండా

Leave A Reply

Your Email Id will not be published!