AP Govt Jobs : ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో జాబ్స్

గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ సీఎం జ‌గ‌న్

AP Govt Jobs : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందులో భాగంగా 243 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కంటిన్యూగా జాబ్స్(AP Govt Jobs) భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఇస్తూ వ‌స్తోంది. ఈ పోస్టుల‌లో 61 చైల్డ్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ (సీడీపీఓ) , అసిస్టెంట్ చైల్డ్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ (ఏసీడీపీఓ) , మ‌హిళా శిశు సంక్షేమ అధికారి, రీజిన‌ల్ మేనేజ‌ర్ పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్ తో పాటు గ్రేడ్ -1 సూప‌ర్ వైజ‌ర్ పోస్టులు 161 ఉండ‌గా 21 శిశు సంర‌క్ష‌ణ కేంద్రాలకు సంబంధించిన సూప‌రింటెండెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ .

ఇదిలా ఉండ‌గా అనుమ‌తి ఇచ్చిన పోస్టుల‌న్నింటినీ ఏపీ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద్వారా భ‌ర్తీ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ రెడ్డి(CM Jagan) ఆదేశించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. విద్యార్హ‌త‌లు, నియామ‌క ప‌ద్ద‌తి, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌, త‌దిత‌ర పూర్తి వివ‌రాలు నోటిఫికేష‌న్ లో స‌రి చూసుకోవాల‌ని స‌ర్కార్ సూచించింది.

Also Read : పోల‌వ‌రంపై వైసీపీ స‌ర్కార్ శీత‌క‌న్ను

1 Comment
  1. Lakshmi says

    I need the Job

Leave A Reply

Your Email Id will not be published!