హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే తన అటిట్యూడ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వచ్చాడు. ఆ తర్వాత పుష్ప మూవీలో తగ్గేదే లే అంటూ కొనసాగుతున్నాడు. తాజాగా తనపై బాలీవుడ్ కు చెందిన కావేరీ బారువా సంచలన వ్యాఖ్యలు చేసింది. తను ఇండియాలో ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నారు. ఈ సందర్బంగా తను ఈ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేసింది అల్లు అర్జున్ గురించి. తనకు ఇగో ఎక్కువ అన్నట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు. అల్లు అర్జున్ తో షూట్ అంటే 42 రూల్స్ పాటించాల్సిందేనని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ తో యాడ్ షూట్ సమయంలో తనకు విచిత్ర అనుభవం ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసేలా చేశాయి. దీనిపై తీవ్రంగా స్పందించాడు నటుడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ ను కలిసేందుకు ముందు మేనేజర్ తనకు 42 రూల్స్ చెప్పారంటూ కావేరీ బారువా బాంబు పేల్చింది. అయితే దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు అల్లు అర్జున్. ఆమె చేసిన కామెంట్స్ వల్ల తనకు డ్యామేజ్ జరిగిందని వాపోయాడు. ఆపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు బన్నీ. దీనిపై ఇంకా స్పందించ లేదు తీవ్ర ఆరోపణలు చేసిన కావేరీ బారువా.
