నిజ‌మైన మ‌హాత్ముడు జ్యోతిబా పూలే : మోదీ

ఘ‌నంగా నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఈ దేశంలో నిజ‌మైన మ‌హాత్ముడు ఒకే ఒక్క‌డు జ్యోతిబా పూలే అని కొనియాడారు ప్ర‌ధాని మోదీ. ఇవాళ పూలే జ‌యంతి సంద‌ర్బంగా రాష్ట్ర‌ప‌తి ముర్ముతో పాటు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, ప్ర‌ముఖులు ఢిల్లీలో పూలే కు పార్లమెంట్ లో నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. నిత్యం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, మాట‌ల తూటాలు పేల్చే రాహుల్ గాంధీ, మోదీలు ప‌ర‌స్ప‌రం చాలా సేపు సంభాషించు కోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంత‌కు ముందు ఫూలేకు పుష్పాంజలి ఘటించేందుకు ప్రధాని మోదీ పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్‌కు చేరుకున్నారు.

మోదీ, రాహుల్ గాంధీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తదితరులు అప్పటికే పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్నారు. ప్రధాని మోదీ రాగానే, ఆయన తన కారు దిగి అక్కడున్న నాయకులను కలిశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ నాయకుడితో ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా, నేను ఆయనకు నా వినయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అణగారిన వర్గాల హక్కులు, అర్హతలను పరిరక్షించడానికి ఆయన తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం దేశానికి సమానత్వం, న్యాయం వైపు మార్గాన్ని చూపింది. సామాజిక న్యాయం వైపు ముందుకు సాగడానికి ఆయన ఆదర్శాలు, ఆలోచనలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి అని గాంధీ అన్నారు. అంతకు ముందు, ప్రధాని మోదీ కూడా ఫూలేకు నివాళులర్పించారు. సామాజిక సంస్కరణలకు, ముఖ్యంగా విద్యారంగాన్ని ప్రోత్సహించడంలో, మహిళల హక్కుల కోసం వాదించడంలో ఆయన చేసిన కృషిని ప్రముఖంగా ప్రస్తావించారు.

Leave A Reply

Your Email Id will not be published!