హైదరాబాద్ : సింగర్ గా పేరు పొందిన మంగ్లీ ఇప్పుడు సంచలనంగా మారారు. గతంలో తను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు తాజాగా ఏకంగా రూ. 10 కోట్ల మోసానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మంగ్లీపై హైదరాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు ఫిర్యాదు చేయడంతో తన నిర్వాకం గురించి బయట పడింది. గత కొంత కాలంగా సింగర్ మంగ్లీ పెద్ద ఎత్తున తనకు ఉన్న ఆదరణను అడ్డం పెట్టుకుని ఇలాంటి దందాలకు తెర లేపిందంటూ విమర్శలు కూడా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంగ్లీ నిర్వాకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తాజాగా కేసు నమోదు కావడం కలకలం రేపింది.
తనను రూ. 10 కోట్లు మోసం చేసిందని, సింగర్ మంగ్లీ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ సదరు బాధితుడు వాపోయాడు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వీరిపై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 351 (2), 352 కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) దాఖలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ సందర్భంగా బాధితులు సంచలన ఆరోపణలు చేశాడు. తనను నిత్యం బెదిరిస్తున్నారంటూ వాపోయారు. తనకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరాడు. లేకపోతే తనను చంపేస్తారంటూ కన్నీటి పర్యంతం కావడం చర్చకు దారితీసేలా చేసింది. ఇదిలా ఉండగా మంగ్లీ స్వస్థలం రాయలసీమ. తన అసలు పేరు సత్యవతి చౌహాన్. తొలుత యాంకర్ గా పనిచేసింది. తెలంగాణ మాండలికంపై పట్టు సంపాదించింది. సింగర్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు అక్రమాలకు, మోసాలకు , దందాలకు తెర లేపింది మంగ్లీ.
