Kalyanram : కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్
ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు
Kalyanram : హైదరాబాద్ – నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసన సభ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల పోటీపై నువ్వా నేనా అన్న రీతిలో ఆరోపణల పర్వానికి తెర తీశాయి.
Kalyanram Comments Viral
ఇదిలా ఉండగా గతంలో జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు. జూనియర్ ను తెలివిగా తప్పించారు. దీనిపై గుర్రుగా ఉన్నారు ఎన్టీఆర్. ఆనాటి నుంచి నేటి వరకు పొలిటికల్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు కళ్యాణ్ రామ్(Kalyanram). ఈ విషయం గురించి తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసి ఎన్నికల్లో ముందుకు వెళుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా కలవడం అప్పట్లో కలకలం రేపింది.
Also Read : Singareni Elections : సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ