Kamran Akmal : బీసీసీఐపై క‌మ్రాన్ అక్మ‌ల్ అక్క‌సు

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ బహిష్క‌రించాలి

Kamran Akmal BCCI : ఆసియా క‌ప్ వివాదం ముదిరి పాకాన ప‌డింది. ఇప్ప‌టికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ అయిన జే షా త‌మ దేశం ఆడ‌బోదంటూ ప్ర‌క‌టించాడు. ఇందుకు సంబంధించి కీల‌క మీటింగ్ జ‌రిగింది. జే షాతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూత‌న చైర్మ‌న్ న‌జామ్ సేథీ హాజ‌ర‌య్యాడు. త‌న వాద‌న‌ను గ‌ట్టిగా వినిపించాడు. కానీ భార‌త్ ఒప్పుకోలేదు. తాము ఓకే చెప్పినా కేంద్ర స‌ర్కార్ అందుకు స‌మ్మ‌తించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కేవ‌లం భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము ఆడ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో మ‌రో సూచ‌న కూడా చేశాడు. పాకిస్తాన్ లో కాకుండా మరెక్క‌డైనా ఆడేందుకు తాము సిద్ద‌మ‌ని తెలిపారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం కొన‌సాగుతుండ‌గా పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ ఖ‌మ్రాన్ అక్మ‌ల్(Kamran Akmal BCCI)  నిప్పులు చెరిగాడు. బీసీసీఐపై, భార‌త జ‌ట్టుపై నోరు పారేసుకున్నాడు. తమ జ‌ట్టు ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిలిచింద‌ని కానీ త‌మ‌కు అందాల్సినంత గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని ఆరోపించాడు.

దీనికి కార‌ణం బీసీసీఐ అంటూ ఆడి పోసుకున్నాడు. మార్చిలో మరో ద‌ఫా ఏసీసీ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. పీసీబీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణ‌యం కోసం వేచి చూస్తోంది. ఈ ఏడాది భార‌త్ లో నిర్వ‌హించే ఐసీసీ వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చాడు. స‌మ‌స్య రెండు బోర్డుల మ‌ధ్య లేదు..రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉంద‌న్నాడు. భార‌త్ కు ఎంత హ‌క్కు ఉందో పాకిస్తాన్ కు కూడా హ‌క్కు ఉంటుంద‌న్నాడు క‌మ్రాన్ అక్మ‌ల్(Kamran Akmal).

Also Read : శాంస‌న్ కెరీర్ ముగిసిన‌ట్లేనా

Leave A Reply

Your Email Id will not be published!