Karthik Rao : ప్రవాస భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, టెలికాం తదితర సంస్థలకు ఎన్నారైలు అత్యున్నతమైన పదవులలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ సర్వే సంస్థ నీల్సన్ కంపెనీకి సిఇవోగా కార్తీక్ రావును నియమించినట్లు ప్రకటించింది.
Karthik Rao Words
ఇది తక్షణమే అమలులోకి వస్తుందని నీల్సన్ వెల్లడించింది. ఇప్పటి వరకు 2018 నుండి సిఇవోగా డేవిడ్ కెన్నీ కార్యనిర్వాహక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక సిఇవోగా నియమితులైన కార్తీక్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తన కెరీర్ లో ఇది చాలా ఉత్తమమైన పోస్టు. ఒక రకంగా నీల్సన్(Nielsen) స్వంత ఇల్లు లాంటిదన్నారు. గతంలో ఎలా పని చేశానో ఇంకా అంత కంటే ఎక్కువగా వంద శాతం పర్ ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు కిరణ్ రావు.
ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారంలో అత్యుత్తమమైన వారితో కలిసి పని చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఆడియన్స్ మెజర్మెంట్ బిజినెస్ కు సిఇవోగా పేరు పొందేందుకు ముందు కిరణ్ రావు నీల్సన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పని చేశారు. నీల్సన్ తనపై ఉంచిన నమ్మకాన్ని మరింత పెంచుకునేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.
Also Read : AP CM YS Jagan : ప్రశ్నిస్తా అన్న దత్తపుత్రుడు ఎక్కడ
