చెల‌రేగిన కోల్ క‌తా త‌ల‌వంచిన గుజ‌రాత్

29 ప‌రుగుల తేడాతో అద్భుత విజ‌యం

కోల్ క‌తా : అజింక్యా ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ దుమ్ము రేపింది. ఐపీఎల్ 19 లీగ్ మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. భారీ స్కోర్ దెబ్బ‌కు వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు చూపించింది. ఒక ర‌కంగా ఫిన్ అలెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను ఉన్నంత సేపు గిల్ సేన గిల గిల లాడి పోయింది. ఏం చేయాలో పాలుపోక కెప్టెన్ శుభ్ మ‌న్ ఎంత‌మంది బౌల‌ర్ల‌ను మార్చినా ఫ‌లితం లేక పోయింది. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డాడు ఫిన్ అలెన్. త‌న విధ్వంసం దెబ్బ‌కు యంగ్ క్రికెట‌ర్ ర‌ఘువంశీ సైతం రెచ్చి పోవ‌డంతో భారీ స్కోరు న‌మోదు చేసింది ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా . ఫ్లే ఆఫ్స్ కు ఆమ‌డ దూరంలో ఉన్న గుజ‌రాత్ కు చుక్క‌లు చూపించింది. తాను కూడా రేసులో ఉన్నాన‌ని చాటి చెప్పింది.

క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటింది కోల్ క‌తా. అజింక్య ర‌హానే త్వ‌ర‌గా అవుట్ అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు కోల్ క‌తా బ్యాట‌ర్లు. స్వంత గ‌డ్డ‌పై రికార్డు స్కోర్ న‌మోదు చేశారు ఆటగాళ్లు ఫిన్ అలెన్ 35 బంతులు ఆడి 4 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో 93 ర‌న్స్ చేస్తే ర‌ఘువంశీ 44 బంతులు ఆడి 4 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ సైతం భారీ ఎత్తున పోరాడేందుకు ప్ర‌య‌త్నించింది. గిల్ , బ‌ట్ల‌ర్, సాయి సుద‌ర్శ‌న్ ఆడినా ఫ‌లితం లేకుండా పోయింది. 29 ప‌రుగుల భారీ తేడాతో ఓట‌మి పాలైంది.

Leave A Reply

Your Email Id will not be published!