Sunil Gavaskar : కోహ్లీ నాక్కొంచెం టైం ఇవ్వు – గవాస్కర్
ఎలా ఆడాలో సూచనలు ఇస్తానన్న సన్నీ
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పూర్ పర్ ఫార్మెన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత నాలుగు సంవత్సరాలలో ఒక్క సెంచరీ చేసిన పాపాన పోలేదు. దీంతో తాజా, మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు.
వెంటనే కోహ్లీని తప్పించాలని అతడి స్థానంలో మరో యువ ఆటగాడికి ఆడే చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నిఖంజ్.
ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టూర్ లో దారుణంగా వైఫలమయ్యాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేశాడు. రెండు టి20 మ్యాచ్ లలో 1, 11 రన్స్ చేశాడు.
ఇక రెండు వన్డే మ్యాచ్ లలో 16, 17 మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో కోహ్లీ ఆట తీరును గమనిస్తూ వస్తున్న సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తనకు కోహ్లీ కేవలం ఓ 20 నిమిషాలు మాట్లాడేందుకు టైమ్ ఇస్తే చాలన్నాడు. తాను ఎలా ఆడాలో నేర్పుతానని, సూచనలు ఇస్తానని చెప్పాడు సన్నీ.
ప్రపంచ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడు కోహ్లీ అని అతడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) . కానీ తాను ఇచ్చే సూచనలు మాత్రం తప్పక సహాయ పడతాయని తనకు నమ్మకంగా ఉందన్నాడు.
ప్రత్యేకించి అవుట్ సైడ్ బంతుల్ని ఆడడం ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల త్వరగా అవుటై వెళుతున్నాడని చెప్పాడు.
Also Read : విండీస్ స్టార్ ఓపెనర్ సిమన్స్ గుడ్ బై