Komatireddy Venkat Reddy : కాబోయే సీఎంను నేనే
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీపై అప్పుడే పోటీ మొదలైంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేనే కాంబోయే ముఖ్యమంత్రినంటూ ఎక్కడికి వెళ్లినా ప్రకటిస్తూనే వస్తున్నారు. తాజాగా సీఎం అభ్యర్థుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి దాకా ఈ రేసులో రేవంత్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, జగ్గా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
Komatireddy Venkat Reddy Comment
తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం అవుతానంటూ ప్రకటించారు. తనకు సీపీపీ చైర్ పర్సన్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు.
దీంతో ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంత రావు ముందు పార్టీ గెలిచేలా చూడాలని ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
మొత్తం మీద సీఎం కుర్చీ పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు.
Also Read : Telangana Election Comment : తెలంగాణం తలవంచని ధీరత్వం