KSRTC: మనుగడ సాగించాలంటే.. బస్సు ఛార్జీల పెంపు తప్పదు KSRTC ఛైర్పర్సన్

మనుగడ సాగించాలంటే.. బస్సు ఛార్జీల పెంపు తప్పదు KSRTC ఛైర్పర్సన్

KSRTC: తమ సంస్థ మనుగడ సాగించాలంటే బస్సు టికెట్ ఛార్జీల పెంపు తప్పదు అని కేఎస్ఆర్టీసీ ఛైర్పర్సన్ అన్నారు. కర్ణాటకలో బస్సు టికెట్ ఛార్జీల్ని పెంచేందుకు కేఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ బస్సుల్లో ఛార్జీల పెంపు అవసరం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్ ఆర్ శ్రీనివాస్ ఆదివారం అన్నారు. 15 నుంచి 20శాతం మేర ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. టికెట్ ధరల్ని పెంచాలో, వద్దో సీఎం సిద్దరామయ్య ఆదేశాలు పై ఆధారపడి ఉంటుందన్నారు. తమ సంస్థ మనుగడ సాగించాలంటే ఛార్జీల పెంపు తప్పదన్నారు.

KSRTC Updates

‘‘ఇంధనం, ఆటో విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయి. 2019 నుంచి ఇప్పటి వరకు బస్సు టికెట్ ఛార్జీల్ని పెంచలేదు. 2020 నుంచి ఇప్పటి వరకు కేఎస్ఆర్టీసీ(KSRTC) ఉద్యోగుల వేతన సవరణ జరగలేదు. అందువల్ల టికెట్ ధరలను పెంచడం తప్పడం లేదు. గత మూడు నెలల్లో కార్పొరేషన్కు రూ.295 కోట్ల నష్టం వాటిల్లింది. 40 కొత్త ఓల్వో బస్సుల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఇప్పటివరకు 600 సాధారణ బస్సుల్ని కొనుగోలు చేశాం’’ అని తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోన్న వేళ ఈ ఛార్జీల పెంపు ప్రతిపాదనతో పురుష ప్రయాణికులపై భారపడుతుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేఎస్ఆర్టీసీ ఛైర్మన్ స్పందించారు. కేవలం పురుష ప్రయాణికులపైనే భారం వేసే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మహిళల బస్సు ప్రయాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు..

Also Read : Amartyasen: హిందువులు, ముస్లింలు కలిసుండటమే భారత సంప్రదాయం.

Leave A Reply

Your Email Id will not be published!