Mamata Banerjee: ఎన్డీయే కూటమిపై బెంగాల్‌ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు !

ఎన్డీయే కూటమిపై బెంగాల్‌ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు !

Mamata Banerjee: ఎన్డీయే కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు. ఆదివారం సాయంత్రం జరగబోయే ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ఇప్పటికే పలువరు దేశ రాజధాని ఢిల్లీకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తామ పార్టీ పాల్గొనటం లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. అంతేకాదు ఆమె శనివారం టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీయే కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee Comment

టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ… ‘‘కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదు. 400 సీట్లు గెలుస్తామన్న వారు(బీజేపీ) కనీస మెజార్టి మార్క్‌ కూడా సాధించుకోలేకపోయింది. వెంటనే ఇండియా కూటమి ప్రభుత్వాని​ ఏర్పాటు చేస్తుందని చెప్పటం లేదు… కానీ, పరిస్థితులు మారటాన్ని మేము ఆసక్తిగా చూస్తూ ఉంటాం. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఏదైనా జరిగితే… ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు?’’ అని మమత అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

మరోవైపు.. గురువారం జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖేర్గే మాట్లాడుతూ.. బీజేపీ తమను పాలించవద్దని ప్రజలు సైతం గ్రహిస్తారని అన్నారు. ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించగా… టీఎంసీ బెంగాల్‌లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. రేపు (ఆదివారం) ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Also Read : Nitish Kumar: నీతీశ్‌ కుమార్ కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌ ?

Leave A Reply

Your Email Id will not be published!