‘మన శంకర వర ప్రసాద్ గారు’ రికార్డ్ బ్రేక్

తొలి రోజే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 84 కోట్లు వ‌సూలు

హైద‌రాబాద్ : సుదీర్గ కాలం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవికి బిగ్ హిట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌ను ఇప్ప‌టికే తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు పొందాడు. గ‌త ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేష్ , వీటికే గ‌ణేష్ తో క‌లిపి తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. ఇత‌ర సినిమాల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. తాజాగా ఈ కొత్త ఏడాది 2026 సంక్రాంతి పండుగ కంటే ముందు జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముంందుకు వ‌చ్చింది మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు చిత్రం. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అందుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప్ర‌ధానంగా ఈ సినిమాకు తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరిలియో ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.

రికార్డుల మోత మోగించేందుకు రెడీ అవుతోంది ఈ మూవీ. దాదాపు ఎనిమిది సంవ‌త్స‌రాల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవికి స‌క్సెస్ ద‌క్కింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందులో మెగాస్టార్ తో పాటు న‌య‌న‌తార‌, వీటీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక పాటలు దుమ్ము రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జ‌నం పెద్ద ఎత్తున సినిమాను ఆద‌రిస్తున్నారు. అక్కున్న చేర్చుకుంటున్నారు. ఇక క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు చిత్రం తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 84 కోట్లు వ‌సూలు చేసింది. ఇది చిరంజీవి కెరీర్ లో బిగ్ క‌లెక్ష‌న్స్ గా పేర్కొంటున్నారు సినీ వ‌ర్గాలు.

Leave A Reply

Your Email Id will not be published!