హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి నిధులు రావని తేలడంతో దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగి వచ్చింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. ఇందులో ఎలాంటి పార్టీ గుర్తులు లేక పోవడంతో బతికి బయట పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే అత్యధికంగా సీట్లను కైవసం చేసుకుంది ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇక బీజేపీ నామ మాత్రంగానే సీట్లను గెలుపొందింది. ఈ తరుణంలో వరుసగా మరోసారి మున్సిపల్ ఎన్నికలకు సిద్దం కావాలని, ఇదే సరైన సమయం అని భావించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. దీంతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లింది. నామ మాత్రంగానే తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. స్వయంగా సీఎం ప్రచారం చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు.
తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు మున్సిపల్ ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇదే విషయాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాగైనా సరే మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మేయర్లు అన్నింటిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కచ్చితంగా గెలుపొందాలని దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా టీపీసీసీ కీలక ప్రకటన చేసింది. పార్టీ నేతలు శ్రేణులకు కీలక సూచనలు చేసింది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదు పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. ఒక్కో మున్సిపల్ వార్డు, కార్పొరేషన్ డివిజన్ నుంచి ఐదు పేర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించింది. 2 దఫాల్లో సర్వే నిర్వహించి, సర్వే పూర్తైన తర్వాత గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థుల పేర్లను స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదా కాంగ్రెస్ ఇన్చార్జి ప్రకటించనున్నారు.
