Mari Selvaraj : ఎవ‌రీ మారి సెల్వ‌రాజ్

టేకింగ్ ..మేకింగ్ లో డిఫ‌రెంట్

Mari Selvaraj : మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు ద‌ర్శ‌కుడు మారి సెల్వ‌రాజ్. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో తీసినవి కొన్ని సినిమాలే. కానీ వాటితో ఒక్క‌సారిగా త‌న వైపు చూపు తిప్పేలా చేశాడు. టేకింగ్ లో మేకింగ్ లో డిఫ‌రెంట్ గా ఉండే ఈ ద‌ర్శ‌కుడి నుంచి మ‌రో సినిమా రాబోతోంది. దీనికి నిర్మాత‌, న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కావ‌డం విశేషం. ఇత‌డిది త‌మిళ‌నాడు లోని తిరునెల్వేలి ఊరు. ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, పాట‌లు కూడా రాస్తాడు.

రామ్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. 2018లో ప‌రియేరుమ్ పెరుమాళ్ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా ప్ర‌శంస‌లు అందుకుంది. విమ‌ర్శ‌కుల నుంచి అభినంద‌న‌లు వ‌చ్చాయి మారి సెల్వ‌రాజ్(Mari Selvaraj) కు. అనేక అవార్డులు, పుర‌స్కారాలు ద‌క్కాయి ద‌ర్శ‌కుడికి.

2021లో ప్ర‌ముఖ న‌టుడు ధ‌నుష్ తో క‌లిసి క‌ర్ణ‌న్ చిత్రం తీశాడు. ఇది పూర్తి స్థాయిలో ఊహించని విధంగా విజ‌య‌వంత‌మైంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. 2021లో బాక్సాఫీసు వ‌ద్ద అత్యంత విజ‌య‌వంతమైన సినిమాల‌లో ఒక‌టిగా పేరు పొందింది. మాన్న‌న్ పేరుతో సినిమా తీశాడు. ఇది పూర్తిగా రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన చిత్రం. ఇందులో ఉద‌య‌నిధి స్టాలిన్ , హాస్య న‌టుడు వ‌డివేలు న‌టించారు. ఇది విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Also Read : DK Shiva Kumar : సిద్ద‌రామ‌య్య భ‌య‌ప‌డ్డారు – డీకే

Leave A Reply

Your Email Id will not be published!