Minister KTR Kaynestech : కేనెస్ టెక్ రూ. 2,800 కోట్లు ఇన్వెస్ట్
సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
Minister KTR Kaynestech : హైదరాబాద్ – శర వేగంతో అభివృద్దిలో ముందుకు దూసుకు పోతున్న హైదరాబాద్ నగరానికి మరో దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో కేనెస్ టెక్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
Minister KTR Kaynestech New Investment
ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో తమ సంస్థ ఆధ్వర్యంలో ఓశాట్ , సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు రూ. 2,800 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించారు. ఓశాట్ , సెమీ కండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు వల్ల కనీసం 2,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్(Minister KTR) వెల్లడించారు. ప్రస్తుతం సెమీ కండక్టర్ పరిశ్రమకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే టాప్ లో హైదరాబాద్ చేరడం మరింత గర్వ కారణంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్.
ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణలో ఫాక్స్ కాన్, కార్నింగ్ వంటి గ్లోబల్ కంపెనీలు భారీ ఎత్తున పెట్టబడులు పెట్టాయి. ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి గమ్య స్థానంగా హైదరాబాద్ నిలవడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : Minister KTR : ఆకలిని తీర్చే అల్పాహారం