Minister KTR : కేసీఆర్ వల్లనే పరిశ్రమల రాక – కేటీఆర్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కామెంట్
Minister KTR : హైదరాబాద్ – ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దార్శనికుడు సీఎం కేసీఆర్ చేసిన కృషి, ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఇవాళ తెలంగాణ దేశానికి ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు కేటీఆర్.
దీని వల్ల ఐటీ, లాజిస్టిక్, ఫార్మా , తదితర రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు తెలంగాణను ఎంచుకున్నాయని చెప్పారు. గురువారం సింటెక్స్ కంపెనీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
Minister KTR Comment
కర్ణాటకకు వెళ్లాల్సిన సింటెక్స్ పరిశ్రమ కానీ , గుజరాత్ కు వెళ్లాల్సిన ఇంకో పరిశ్రమ కానీ తెలంగాణకు వచ్చాయంటే సీఎం సమర్థ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు కేటీఆర్(Minister KTR). ఇన్వెస్టర్ సమ్మిట్ లు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు మంత్రి.
కేసీఆర్ చెప్పిన ఒకే ఒక్క విషయం. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారులను సంతోషంగా ఉంచాలని స్పష్టం చేశారని తెలిపారు. దీని వల్లనే ఇవాళ కంపెనీలు తెలంగాణ కోసం క్యూ కడుతున్నాయని మంత్రి కేటీఆర్.
దిగ్గజ కంపెనీలు రావడం తమకు సంతోషంగా ఉందన్నారు. 26 శాతానికి పైగా ఇన్వెస్ట్ చేశాయని తెలిపారు మంత్రి కేటీఆర్. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కంపెనీలకు సానుకూలంగా సపోర్ట్ చేస్తూ వచ్చామన్నారు . రాబోయే రోజుల్లో పూర్తి సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
Also Read : Kitex Group Invest : తెలంగాణలో కిటెక్స్ గ్రూప్