Minister KTR : డేటా సెంటర్లకు హైదరాబాద్ కేరాఫ్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రపంచ నగరాలలో ఒకటిగా పేరు పొందిందని చెప్పారు. దీనికి తమ ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు.
Minister KTR Comment
నగరంలో ప్రపంచ స్థాయి వ్యాపార పార్కులు, డేటా సెంటర్లను అభివృద్ది చేయడంలో నిబద్దత నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఐటీ పరంగా తాను ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని తెలిపారు కేటీఆర్(Minister KTR).
ఐటీ రంగం రాకెట్ కంటే వేగంగా అభివృద్ది చెందుతోందని స్పష్టం చేశారు. బుధవారం క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (సీఎల్ఐ) అభివృద్ది చేసింది హైదరాబాద్ నగరంలో. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ ను మంత్రి ప్రారంభించారు.
40 మెగా వాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు . ఇందులో భాగంగా క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ఆసియా లోని అతి పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్ లలో ఒకటిగా ఉంది. ఇది సింగపూర్ లో ప్రధాన కార్యాలయం ఉంది. 40 దేశాలలో 260 కంటే ఎక్కవ నగరాల్లో విస్తరించి ఉంది.
Also Read : Anganwadi Protest : ఎస్ఐపై అంగన్ వాడీల కన్నెర్ర