Minister KTR : ఎన్నారైల క్షమాభిక్ష కోసం ప్రయత్నం
చొరవ తీసుకుంటున్న మంత్రి కేటీఆర్
Minister KTR : దుబాయ్ – బతుకు దెరువు కోసం వేలాది మంది తెలంగాణకు చెందిన వారు అరబ్ కంట్రీస్ లో ఉంటున్నారు. దుబాయ్ లో ప్రస్తుతం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ ప్రాంతానికి చెందిన వారు శిక్ష అనుభవిస్తున్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పులు కొన్నైతే, అక్కడి చట్టాలు తెలియక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు .
Minister KTR Visits Dubai Bharat Council
వీరి గురించి తెలుసుకున్న కేటీఆర్(Minister KTR ) రంగంలోకి దిగారు. దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ ఆఫీసును సందర్శించారు. కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, తదితరులు చర్చించారు మంత్రి. సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల రిలీజ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు కేటీఆర్.
ఈ అంశాన్ని దుబాయ్ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ జిల్లాకు చెందిన రవి, మల్లేష్ , నాంపల్లి, లక్ష్మణ్ , శివరాత్రి హన్మంతు ఓ కేసులో భాగంగా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 15 ఏళ్లయింది. జైలు శిక్ష కూడా పూర్తయింది. క్షమాభిక్ష పత్రాన్ని అందజేశారు. ఇంకా అటు వైపు నుంచి స్పందన రాలేదు. మరోసారి మంత్రి ప్రయత్నం ముమ్మరం చేశారు. ఈ విషయంలో కౌన్సిల్ జనరల్ ప్రయత్నం చేయాలని కోరారు కేటీఆర్.
Also Read : CM KCR : 16న కృష్ణమ్మ చెంతన కేసీఆర్ పూజలు