Minister Ponnam Prabhakar: వీఐపీల కారు డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్ష – మంత్రి పొన్నం
వీఐపీల కారు డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్ష - మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. వీఐపీల రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల కారు డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం గాంధీభవన్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ…. ‘ఈ మధ్యకాలంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వీఐపీల సంఖ్య పెరుగుతోంది. యువ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం నన్ను కలిచివేసింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ల కారు డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాని నిర్ణయించాం. వీఐపీలందరికీ వారి డ్రైవర్లను పరీక్షకు పంపాలని లేఖలు పంపుతాం. పరీక్ష తరువాత వారి రిపోర్టును అందజేస్తాం. ఎమ్మెల్యేలు, ఐపీఎస్ లు, ఐఏఎస్ లు సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు అనుభవజ్ఞులైన డ్రైవర్లనే నియమించుకోవాలి అని సూచించారు.
Minister Ponnam Prabhakar Rule
రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని… మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె నివాసంతో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ నెల 23న అవుటర్ రింగ్ రోడ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.
Also Read : PM Narendra Modi: పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ‘సుదర్శన్ సేతు’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ !