Aditi Sunil Tatkare : షిండే సర్కార్ లో మహిళకు చోటు
ఎన్సీపీ రెబల్ అభ్యర్థి అదితి తట్కరే
Aditi Sunil Tatkare : భారత దేశ రాజకీయాలలో అపర చాణుక్యుడిగా గుర్తింపు పొందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కోలుకోలేని రీతిలో చుక్కులు చూపించాడు తమ్ముడి కొడుకు అజిత్ పవార్. పార్టీకి సంబంధించి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఉన్నట్టుండి ఆదివారం తిరుగుబాటు ప్రకటించారు. అజిత్ పవార్ ఉన్నట్టుండి షిండే, ఫడ్నవీస్ సర్కార్ కు మద్దతు ప్రకటించాడు.
ఆపై కేబినెట్ లో కూడా చేరిపోయాడు. ఆయనకు డిప్యూట సీఎం పదవి దక్కింది. మరో నలుగురికి చోటు దక్కింది. వీరిలో ఎన్సీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న అదితి తట్కరే కు తాజాగా విస్తరించిన కేబినెట్ లో స్థానం లభించడం విశేషం. ఎన్సీపీ మొత్తం ఎమ్మెల్యేలలో ఆమె ఒక్కరే గెలుపొందారు.
ఇంతకీ ఎవరీ అదితి సునీల్ తట్కరే(Aditi Sunil Tatkare) ఎవరు. మహారాష్ట్ర లోని రోహా పట్టణానికి చెందిన వారు. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017-19 వరకు రాయగడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. గతంలో కూడా మంత్రిగా పని చేశారు. కానీ ప్రస్తుతం షిండే సర్కార్ లో తొలి మహిళ కావడం గమనార్హం. అదితి పర్యాటకం, సమాచార, ఐటీ , లా, తదితర శాఖలను సమర్థవంతంగా నిర్వహించింది. మరోసారి చోటు దక్కింది.
ఇదిలా ఉండగా ఇవాళ షిండేకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలలో ఆమె కూడా ఒకరుగా ఉన్నారు. నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read : Peddha kapu Teaser : ఆసక్తి రేపుతున్న పెద కాపు టీజర్