MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు

కాగా, ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసుకున్నారు

MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు జైలుకు పంపింది. కవితకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఢిల్లీ పోలీసులు జైలుకు పంపారు. ఆమెను జైలు వ్యాన్‌లో తరలించారు. ఆమెను ఏప్రిల్ 9 వరకు తీహార్ జైలులో ఉంచనున్నారు.

MLC Kavitha Case Update

ఇదిలా ఉండగా…ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఎమ్మెల్యే కవితకు(MLC Kavitha) ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. కవితకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించనున్నారు.ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.అయితే కవితను అదుపులోకి తీసుకోవడం ఇది మూడోసారి. మొదటి ఏడు రోజులు, తర్వాత మూడు రోజులు, ఇప్పుడు 14 రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. తీహార్ జైలులో కవితను విచారించే అవకాశముంది.

కాగా, ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పిటిషన్‌పై స్పందించేందుకు సమయం కావాలని ఈడీ కోర్టుకు తెలియజేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బెయిల్ దరఖాస్తుపై ఏప్రిల్ 1న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

Also Read : IPL 2024 : మల్లి హార్దిక్ నుంచి రోహిత్ కి మారిన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ..?

Leave A Reply

Your Email Id will not be published!