MS Dhoni Plays : ట్రంప్ తో గోల్ఫ్ ఆడిన ధోనీ
సోషల్ మీడియాలో వైరల్
MS Dhoni Plays : అమెరికా – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ హవా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా ఐపీఎల్ నుంచి వెనక్కి తగ్గలేదు.
MS Dhoni Plays Golf with Trump
మనోడికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా , ఎక్కడికి వెళ్లినా ధోనీ(MS Dhoni) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఏకంగా అమెరికాలో సైతం ధోనీ పేరు మారుమ్రోగుతోంది.
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఏకంగా గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు ఈ మాజీ క్రికెటర్. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సామాన్యంగా ట్రంప్ తో కలవాలంటేనే చాలా కష్ట పడాల్సి ఉంటుంది. అంతే కాదు ముందస్తు అపాయింట్ మెంట్ కూడా తీసుకోవాలి.
కానీ స్వయంగా మాజీ చీఫ్ మహేంద్ర సింగ్ ధోనీని తనతో గోల్ఫ్ ఆడాల్సిందిగా ఆహ్వానించడం విస్తు పోయేలా చేసింది. దీంతో ఈ జార్ఖండ్ డైనమెట్ కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదని తేలి పోయింది. ఇప్పటికే మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం గోల్ఫ్ లో ప్రావీణ్యం సాధించారు.
Also Read : BCCI Golden Ticket : సచిన్ కు గోల్డెన్ టికెట్ – బీసీసీఐ