French Open 2022 Nadal : ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత నాదల్
22వ గ్రాండ్ స్లామ్ తో అరుదైన రికార్డ్
French Open 2022 Nadal : ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫ్రెంచ్ ఓపెన్ 2022 టైటిల్ ను వరల్డ్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ చేజిక్కించుకున్నాడు. ఫైనల్ లో రూడ్ ను ఓడించాడు.
రికార్డు స్థాయిలో 22వ గ్రాండ్ స్లామ్ గెల్చుకోవడం. కోర్ట్ ఫిలిప్ – చాట్రియర్ లో పురుషుల సింగిల్స్ ఫైనల్ జరిగింది. ఇదిలా ఉండగా
రాఫెల్ నాదల్(French Open 2022 Nadal) ఎప్పుడూ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో ఓడి పోయిన దాఖలాలు లేవు.
ప్రత్యర్థి రూడ్ ను 6-3, 6-3, 6-0 వరుస సెట్లతో ఓడించి చరిత్ర సృష్టించాడు నాదల్. 14వ ఫ్రెంచ్ ఓపెన్(French Open 2022 Nadal) టైటిల్ కైవసం చేసుకున్నాడు.
మొదటిసారి గ్రాండ్ స్లామ్ ఫైనలిస్ట్ కాస్పర్ రూడ్ పై ఘన విజయాన్ని నమోదు చేశాడు నాదల్. స్పెయిన్ ఆటగాడైన నాదల్ రికార్డు స్థాయిలో ఇది 14వ కిరీటం దక్కినట్లవుతుంది.
ప్రస్తుతం నాదల్ వయస్సు 36 ఏళ్లు. శారీరక రుగ్మతలను అధిగమించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలిచాడు. రోజర్ ఫెదరర్ , నొవాక్ జొకోవిచ్ లను ఖంగు తినిపించాడు.
నాదల్ రోలాండ్ గారోస్ లో అత్యున్నత హోదాను పొందాడు. అక్కడ అతని గౌరవార్థం ఇప్పటికే ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇక రూడ్ 2020 సీజన్ ప్రారంభం నుండి క్లే కోర్టులో విజయాలు సాధిస్తూ వచ్చాడు.
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్స్ కు చేరుకున్న అతని దేశం నుండి మొదటి వ్యక్తి. 2018 నుండి మల్లోర్కాలోని తన అకాడెమీలో శిక్షణ పొందుతున్న రూడ్ గురించి నాదల్ గొప్పగా చెప్పాడు.
అతడి పట్ల తనకు గౌరవం ఉందన్నాడు. గత రెండేళ్లుగా బాగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చాడు. కాగా రాఫెల్ నాదల్ , రూడ్ ఇంత ముందెన్నడూ పోటీ మ్యాచ్ లు ఆడలేదు.
Also Read : 10 వేల పరుగుల క్లబ్ లో జో రూట్