G Kishan Reddy : కిషన్ రెడ్డిని కలిసిన నాటా ప్రతినిధులు
డల్లాస్ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్
G Kishan Reddy : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖల కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని నాటా ప్రతినిధులు వీబీ రెడ్డి, మేచినేని శ్రీనివాస రావు కలిశారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్ ) , డల్లాస్ ఏరియాస్ ఆఫ్ తెలుగు అసొసియేషన్ (డేటా), ఆస్టిన్ హిందూ టెంపుల్ , వివిధ సంఘాల తరపున రెడ్డి కిషన్ రెడ్డిని కలిశారు.
G Kishan Reddy Write Letter Airles
హైదరాబాద్ లో పర్యటనలో భాగంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు. డల్లాస్, సన్ ఆంటోనియో, ఆస్టిన్ తదితర నగరాలలో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నారని తెలిపారు. దాదాపు 5 లక్షల మందికి పైగా తెలుగు వారు ఉన్నారని వెల్లడించారు. డల్లాస్ నుండి హైదరాబాద్ కు నేరుగా ప్రయాణం చేసేలా, తక్కువ సమయంలో ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకునేలా విమాన సదుపాయం కల్పించాలని కోరారు.
రెడ్డి ఇచ్చిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy) స్వీకరించారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వెంటనే కిషన్ రెడ్డి ఢిల్లీ లోని వారి కార్యాలయ సిబ్బందిని టాటా, ఇతర ఫ్లైట్ ఆపరేటర్ కంపెనీలకు లేఖ రాయాల్సిందిగా ఆదేశించారు.
Also Read : TTD Tickets : నవంబరు నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల