WFI Chief Case : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కేసులో ట్విస్ట్
ఫిర్యాదుదారు మైనర్ కాదు మేజర్
WFI Chief Case : భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, యూపీకి చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) కేసులో రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమను లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నామని మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. తమకు రక్షణ కావాలని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నుంచి కాపాడాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. చివరకు వారిపై ఢిల్లీ ఖాకీలు దాడికి దిగారు. అనుచిత ప్రవర్తనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ తరుణంలో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై రెజ్లర్లతో పాటు మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట ఒప్పుకోలేదు. చివరకు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సీరియస్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఢిల్లీ ఖాకీలను ఆదేశించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండు కేసులు నమోదు చేశారు. ఒకటి మహిళా రెజ్లర్లు, మరొకటి మైనర్ బాలిక తండ్రి చేసింది.
ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేశారు. ఈ తరుణంలో మైనర్ గా పేర్కొన్న బాధితురాలి తండ్రి ఊహించని రీతిలో కోర్టుకు తన కూతురు మైనర్ కాదు మేజర్ అంటూ తెలిపాడు. దీంతో కేసులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు మహిళా రెజ్లర్లతో పాటు బజరంగ్ పునియా బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో భేటీ అయ్యారు. ఈనెల 15 వరకు డెడ్ లైన్ పెట్టామని ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు పునియా.
Also Read : Bhatti Vikramarka : భూముల అప్పగింతలో మీ వాటా ఎంత