NSR Kites Festival : 29న గ్రీన్ వుడ్స్ ‘పతంగుల పండుగ’
బెంగళూరులో ఎన్ఎస్ఆర్ వెంచర్స్ నిర్వహణ
NSR Kites Festival : కర్ణాటకలో ఎన్ఎస్ఆర్ గ్రీన్ వుడ్స్ కు ఆదరణ ఉంది. కారణం ఏమిటంటే గ్రామీణ వాతావరణాన్ని ప్రతిఫలించేలా ఎన్ఎస్ఆర్ సంస్థ గృహాలను నిర్మిస్తోంది. మన సంస్కృతిని కాపాడుకునేలా, ప్రకృతితో మమేకం అయ్యేలా ఇప్పటికే గ్రీన్ వుడ్స్ పేరుతో ఓ పల్లెనే ఏర్పాటు చేశారు సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ రాఘవరావు బెల్లంకొండ. ప్రతి ఏటా అందరినీ ఒకే చోట చేర్చేలా, కలిసికట్టుగా ఉండేలా పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
తాజాగా జనవరి 29న భారీ ఎత్తున ఎన్ఎస్ఆర్ గ్రీన్ వుడ్స్ కైట్స్ ఫెస్టివల్ ( పతంగుల పండుగ)కు(NSR Kites Festival) శ్రీకారం చుట్టారు. ఇందులో ఇప్పటికే కమ్యూనిటీలో ఉన్న వారితో పాటు వారి కుటుంబీకులు, స్నేహితులు, ఇతరులు కూడా భాగం పంచుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు సంస్థ చైర్మన్. పూర్తిగా గ్రామీణ వాతావరణం ప్రతిఫలించేలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు.
కమ్యూనిటీ వార్షిక కార్యక్రమం పేరుతో కైట్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. సంప్రదాయన్ని కొనసాగించేందుకు, స్థానికంగా సాంస్కృతిక ఉత్సవాన్ని తిరిగి పొందేందుకు దీనిని చేపట్టారు చైర్మన్ రాఘవరావు బెల్లంకొండ. అంతే కాదు ఈ పతంగుల ఉత్సవంలో ప్రధానంగా స్థానికంగా ప్రతిభ, నైపుణ్యం కలిగిన కళాకారులను ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు.
మకర సంక్రాంతి మాసంలో గాలి పతంగులు(NSR Kites Festival) ఎగుర వేయడం మామూలే. ఇందులో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నారు.
ఈ పతంగుల పండుగ ఉత్సవంలో పాల్గొనే వారితో సంభాషించడం, వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం, కొత్త వాటిని నేర్చుకోవడం, పిల్లలు, పెద్దలతో కలిసి కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం తమ ఉద్దేశమని స్పష్టం చేశారు రాఘవరావు బెల్లంకొండ.
ఉదయం నుంచి రాత్రి దాకా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని అనుకుంటే బెంగళూరులో ఉన్న తెలుగు వారు ఎన్ఎస్ఆర్ సంస్థ చైర్మన్ ను 9980159376 లో సంప్రదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం కుటుంబంతో సహా చేరండి..పల్లెతనపు పండుగ వాతావరణాన్ని ఆస్వాదించండి.
Also Read : హాట్ హాట్ గా రచ్చ చేస్తున్న దీపికా పిల్లి అందాలు