Olena Zelensky : ఆగని రష్యా బలగాల అత్యాచారాలు – ఒలెనా
సంచలన ఆరోపణలు చేసిన ప్రథమ మహిళ
Olena Zelensky : రష్యా కంటిన్యూగా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతోంది. ఇంకా ఆగడం లేదు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడా లొంగడం లేదు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేశాన్ని రష్యాకు చెందనీయనంటూ ప్రకటించాడు.
ఆయన ఈ మాటలు అనడం వెనుక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి , బలం ఎవరో కాదు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కీ(Olena Zelensky). ఆమె ముందు నుంచి ఉక్రెయిన్ ప్రజల పక్షాన ఉన్నారు. అన్నింటికీ ఆమె సమాధానం చెబుతున్నారు. ప్రజలను బయటకు రావద్దంటూ కోరారు. తాజాగా ఒలెనా జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యా సైనికులు యుద్ద కాంక్షతో రగిలి పోతున్నారని కానీ యుద్ధ నీతిని విస్మరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒలెనా కన్నీటి పర్యంతం అయ్యారు. రష్యా జవాన్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కనీసం మానవత్వం అన్నది లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉక్రెయిన్ మహిళలు, యువతులు, బాలికల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ వాపోయారు.
అంతే కాదు రష్యా సైనికుల భార్యలు సైతం తమపై అత్యాచారానికి ప్రోత్సహిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఒలెనా జెలెన్ స్కీ. రష్యా బలగాలు అత్యాచారాన్ని యుద్ధ ఆయుధంగా ఉపయోగించు కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘర్షణ సమయంలో లైంగిక హింసపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. లండన్ లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఒలెనా జెలెన్స్ స్కీ ప్రసంగించారు. యుద్దం అనివార్యంగా మార్చిన ఘనత రష్యాదేనని ఆరోపించారు.
Also Read : చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా జాడేది