Pawan Kalyan : తాండూరులో ప‌వ‌న్ హ‌ల్ చ‌ల్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో న‌టుడు

Pawan Kalyan : తాండూరు – తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు జ‌న‌సేన పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంకా రెండు రోజులు మాత్ర‌మే ఉంది ప్ర‌చారం చేప‌ట్టేందుకు.

Pawan Kalyan in Tandur

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఊహించ‌ని రీతిలో కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వంతో ములాఖ‌త్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల్లో క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించారు. బీజేపీ పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌కు మద్ద‌తుగా నిలిచారు.

తాజాగా తాండూరులో ప్ర‌త్య‌క్షం అయ్యారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున నిలిచిన వేమూరి శంక‌ర్ గౌడ్ త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు. తన‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్నారు. రాష్ట్రంలో బీజేపీ, జ‌న‌సేన పార్టీ క‌లిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున మార్పు కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దేశ వ్యాప్తంగా మోదీ హ‌వా అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్నారు. సుస్థిర‌మైన పాల‌న కేవ‌లం ఒక్క బీజేపీ నుంచే సాధ్య‌మనే అభిప్రాయం అంత‌టా నెల‌కొంద‌న్నారు.

Also Read : Bhatti Vikramarka : ఆరు నూరైనా గెలిచేది నేనే

Leave A Reply

Your Email Id will not be published!