Najam Sethi Jay Shah : మాతో ఆడ‌క పోతే మేం మీతో ఆడం

జే షాకు స్ప‌ష్టం చేసిన న‌జామ్ సేథీ

Najam Sethi Jay Shah : ఆసియా క‌ప్ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరి పాకాన ప‌డింది. ఇప్ప‌టికే గ‌త కొన్నేళ్లుగా భార‌త్ ,పాకిస్తాన్ దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు స‌రిగా లేవు. దీని ప్ర‌భావం ఆట‌ల‌పై ప‌డింది. ప్ర‌త్యేకించి భార‌త్ ,పాక్ మ‌ధ్య మ్యాచ్ అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీఆర్పీ రేటింగ్ ఉంటుంది.

ఇక ఐసీసీ ఇప్ప‌టికే నిర్దేశించిన షెడ్యూల్ ప్ర‌కారం 2023లో పాకిస్తాన్ లో ఆసియా క‌ప్ నిర్వ‌హించాలి. కానీ భ‌ద్ర‌తా కారాణాల రీత్యా తాము ఆడే ప్ర‌స‌క్తి లేద‌ని ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్ర‌క‌టించింది. మ‌రో వైపు బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా, ఏసీసీ చైర్మ‌న్ గా ఉన్న జే షా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ న‌జామ్ సేథీతో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు టాక్. ఇక ఆసియా క‌ప్ హోస్టింగ్ హ‌క్కులు పాకిస్తాన్ కు ఉన్నాయి. సెక్యూరిటీ ప్రాబ్లం కార‌ణంగా పాకిస్తాన్ లో కాకుండా త‌ట‌స్థ వేదిక దుబాయ్ లేదా శ్రీ‌లంక‌లో నిర్వ‌హిస్తే తాము ఆడాలా వ‌ద్దా అన్న దానిపై ఆలోచిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు జే షా,

మంత్రి అనురాగ్ ఠాకూర్. గ‌తంంలో చైర్మ‌న్ గా ఉన్న ర‌మీజ్ ర‌జా సైతం త‌మ‌తో ఆడ‌క పోతే మేం మీతో ఆడ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఆనాటి నుంచి నేటి దాకా కొత్త చీఫ్ వ‌చ్చినా స‌మ‌స్య అలాగే కొన‌సాగుతూ వ‌చ్చింది. ఇక పీసీబీ చైర్మ‌న్ న‌జామ్ సేథీ జే షాకు(Najam Sethi Jay Shah) స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పాకిస్తాన్ తో గ‌నుక ఆడ‌క పోతే తాము భార‌త్ తో ఆడ‌బోమంటూ స్ప‌ష్టం చేశారు. ఈ వివాదం ఐసీసీ దాకా వెళ్లింది. కానీ ప్ర‌స్తుతం ఐసీసీ కూడా బీసీసీఐ చెప్పిన మాట విన‌క త‌ప్ప‌దు.

Also Read : విమెన్ ఐపీఎల్ కు ముహూర్తం ఫిక్స్

Leave A Reply

Your Email Id will not be published!