TRS MLAs Case : ప్లీజ్ ‘ఆ నలుగురు’ కనిపిస్తే చెప్పండి
ప్రగతి భవన్ లోనా లేక ఫామ్ హౌస్ లోనా
TRS MLAs Case : ఆ నలుగురు అనే సరికల్లా ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా గుర్తుకు వస్తుంది. కానీ పేరు ఒక్కటే కానీ కథ వేరు. సీన్ కూడా వేరే.
అచ్చంగా సినిమాను తలపింప చేసింది రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న ఘటన. మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు ఈ సీన్ మరింత రక్తి కట్టింది.
తెలంగాణ లోనే కాదు ఏకంగా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చాలా పకడ్బందీగా కొనసాగింది. మరి ఆ నలుగురు ఎవరో కాదు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు(TRS MLAs Case).
వీరిలో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన గువ్వల బాలరాజు, కొల్లాపూర్ కు చెందిన బీరం హర్ష వర్దన్ రెడ్డి, తాండూరుకు చెందిన రోహిత్ రెడ్డి తో
పాటు మరొకరు రేగా కాంతారావు. వీరిని కొనుగోలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముగ్గురిని పంపించిందంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ఆపై మునుగోడులో గులాబీ జెండా ఎగిరాక (విజయం సాధించాక ) కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బహిరంగంగా ఆరోపణలు
చేశారు. ఆయన నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన పరివారాన్ని, బీజేపీని, దాని అనుబంధ సంస్థలను ఏకి పారేశారు.
ఈ దేశం ఎటు పోతోందంటూ ఆవేదన చెందారు. ఇలాగే ఉంటే దేశాన్ని అమ్మేస్తారంటూ వాపోయారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను
కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు.
సీఎం ఆరోపణలు అబద్దమని, ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా ప్రగతి భవన్ లో, ఫామ్ హౌస లో తయారు చేశారంటూ భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.
ఇక కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అయితే మధ్యవర్తులతో మాకెందుకు..కొనాలని అనుకుంటే బాజాప్తాగా మేమే డైరెక్ట్ గా కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
అంతే కాదు ఎవరైనా రావాలని అనుకుంటే రాజీనామా చేసి రావాలని, ఎన్నికల్లో నిలిచి గెలవాలని అన్నారు. మొత్తంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రాజకీయాలు మరింత దిగజారి పోయాయి.
ఈ ఎపిసోడ్ రోజు రోజుకు మరింత రక్తి కడుతోంది. ఓ వైపు లిక్కర్ స్కాం. మరో వైపు గ్రానైట్ లో హవాలా దందా..ఆపై ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసుతో జనం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మోయినాబాద్ కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎమ్మెల్యేలను
రూ. 100 కోట్లకు కొనుగోలు చేయాలని అనుకున్నారని సీఎం ఆరోపించారు. మరి ఆ నలుగురి ఎమ్మెల్యేల మార్కెట్ వాల్యూ అంత ఉందా
అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో ఒక్కసారి మాత్రమే కనిపించారు ఆ నలుగురు. ఆ తర్వాత నుంచి
గాయబ్ అయ్యారు.
మొత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ ప్రజాప్రతినిధులు(TRS MLAs Case) కనిపించకుండా పోవడంపై ఆయా నియోజకవర్గాల
ప్రజలు ఎదురు చూస్తున్నారు. దయచేసి వాళ్లు కనిపిస్తే చెప్పాలని కోరుతున్నారు.
Also Read : ఇక ఏపీకి అన్నీ మంచి రోజులే – పవన్