PM Modi Gifts : బైడెన్ దంపతులకు మోదీ కానుకలు
విస్తు పోయిన బైడెన్ , జిల్ బైడన్
PM Modi Gifts : ప్రధాన మంత్రి మోదీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎక్కడకు వెళ్లినా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వస్తువులను బహుమతిగా ఇస్తారు. వాటి ప్రాముఖ్యతను కూడా తెలియ చేస్తారు. ఆహ్వానించడం, అతిథులను ఆశ్చర్య చకితులను చేయడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. ఆతిథ్యం ఇవ్వవడంలో కూడా ఆయనకు ఆయనే సాటి.
తాజాగా ప్రధాన మంత్రి మోదీ(PM Modi) అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు మోదీని. వైట్ హౌస్ లో విందు సందర్భంగా వారిని విస్తు పోయేలా చేశారు నరేంద్ర మోదీ. బైడెన్ దంపతులకు 80 ఏళ్ల గుర్తుగా దాస్ దానం లేదా 10 విరాళాలతో కూడిన ప్రత్యేక గంధపు పెట్టెను అందజేశారు. ఇది కేవలం బైడెన్ కు మాత్రమే.
ఇక ప్రథమ మహిళ జిల్ బైడెన్ కోసం ల్యాబ్ లో పరీక్షించిన 7.5 క్యారెట్ ఆకుపచ్చ వజ్రాన్ని అందజేశారు బహుమతిగా. అంతే కాదు బైడెన్ కు ఇష్టమైన కవి డబ్ల్యూబి యీట్స్ సహ రచయిత అయిన ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషత్తుల మొదటి కాపీని అందజేశారు.
-బిడెన్‌కి ఇష్టమైన కవి డబ్ల్యుబి యీట్స్ సహ-రచయిత అయిన ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషత్తుల మొదటి ఎడిషన్ కాపీ అందించారు. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మోదీకి తమ వంతు గుర్తుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా కొన్నింటిని బహూకరించారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి చేతితో తయారు చేసిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీ, ఒక పాతకాలపు అమెరికన్ కెమెరా, హార్డ్ కవర్ పుస్తకం ఇచ్చారు.
Also Read : YS Sharmila : అమరుల త్యాగం దొర వైభోగం – షర్మిల