PM Modi : మీ ప్రేమను మరిచి పోలేను – మోదీ
పీఎం క్రేజ్ మామూలుగా లేదుగా
PM Modi : జకార్తా – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. సాదర స్వాగతం పలికేందుకు పోటీ పడుతున్నారు. భారత మాతా కీ జై అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి.
PM Modi Words
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇండోనేషియాలో పర్యటించారు. అక్కడ జరిగిన ఆసియా సదస్సు -2023లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు జకార్తాకు చేరుకున్న సందర్బంగా నరేంద్ర మోదీకి(PM Modi) ఊహించని రీతిలో స్వాగతం పలికారు. అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు.
ఈ సందర్బంగా సంతోషానికి లోనయ్యారు ప్రధానమంత్రి. తనను ఆదరిస్తున్నందుకు, అంతులేని ప్రేమను కురిపిస్తున్నందుకు సర్వదా తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. సదస్సులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచాన్ని ప్రస్తుతం ఉగ్రవాదం పట్టి పీడిస్తోందన్నారు.
దానిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. టెక్నాలజీని మనమంతా వాడుకోవాలని కోరారు ప్రధానమంత్రి. తనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఇండోనేషియా ప్రజలకు థ్యాంక్స్ తెలిపారు . ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Also Read : Harbhajan Singh : శాంసన్ కంటే సూర్య బెటర్