Modi Tribute : ‘ఆజాద్ ..తిలక్’ దేశానికి గర్వకారణం
జయంతి సందర్భంగా మోదీ నివాళి
Modi Tribute : భారత దేశం ఎందరో వీరులను కన్నది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది బలిదానాలు చేసుకున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
తమను తాము అర్పించుకున్నారు. ఆంగ్లేయులను ఎదిరించి దేశం కోసం ప్రాణాలు విడిచిన పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఇవాళ.
ఈ సందర్భంగా శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చంద్రశేఖర్ ఆజాద్ కు నివాళి(Modi Tribute) అర్పించారు. ఆజాద్ చేసిన త్యాగం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
భారత జాతి ముద్దు బిడ్డగా అభివర్ణించారు. దైర్య సాహసాలు, దేశ భక్తికి ప్రతిరూపమని కొనియాడారు ప్రధాన మంత్రి. చంద్రశేఖర్ ఆజాద్ , బాల గంగాదర్ తిలక్ గురించి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.
మన్ కీ బాత్ సందర్భంగా వారిని స్మరించు కోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు మోదీ(Modi Tribute). ఇక ప్రధానితో పాటు స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పించిన వారిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కూడా ఉన్నారు.
పోరాట వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ , సమర యోధుడు బాల గంగాధర తిలక్ లు దేశానికి స్పూర్తి దాయకంగా నిలిచారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం అయిన పోఖ్రియాల్ కూడా ఇలా రాశారు.
శౌర్యం, పరాక్రమం, ధైర్యానికి ప్రతిరూపం. అమర్ షహీద్ చంద్రశేఖర్ ఆజాద్ కు నా నివాళులు అని తెలిపారు. చంద్రశేఖర్ ఆజాద్ ను గొప్ప స్వాతంత్ర సమరయోధుడంటూ పేర్కొన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.
Also Read : మీడియాపై సీజేఐ సంచలన కామెంట్స్