డిజైన్ల ప్ర‌కార‌మే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు

పోలవరం పై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈ సి ఆర్ ఎఫ్ ) డ్యామ్ నిర్మాణం పై అంతర్జాతీయ నిపుణులు సమీక్షించారు. తోలి రోజు పర్యటనలో ప్రాజెక్ట్ లో క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌ పాల్ ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జల వనరుల శాఖ, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన జరిగింది. కేంద్ర జలసంఘం డిజైన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ సరబ్జిత్‌ సింగ్‌ బక్షి, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, ఉప సంచాలకుడు ఏ. ప్రవీణ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేష్ కుమార్‌, సహాయ సంచాలకుడు సీహెచ్‌ సంజీవ్‌, నేషనల్‌ వాటర్‌ సిస్టం డైరెక్టర్‌ పన్నీర్‌ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్‌ గౌతమ్‌ , సి ఎస్ ఎం ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు షాహిద్‌ నూర్‌, ఎం.కె. బాషా, ఉదయ్‌ భాను చక్రబోర్తి, వ్యాప్కోస్‌ జనరల్‌ మేనేజర్‌ కేపీఎస్‌ త్యాగీ, ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె. నరసింహ మూర్తి, చీఫ్‌ ఇంజినీర్‌ కె. శేషుబాబు, ఎస్‌ఈలు పి. రామచంద్రరావు, డి. తిరుమలరావు, ఈఈలు డి. శ్రీనివాస్‌, ప్రేమ్‌చంద్‌, కె. బాలకృష్ణ మూర్తి, ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీ గంగాధర్ కుమార్‌, డీజీఎం మురళి పమ్మి, కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష అనంతరం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ లో క్షేత్రస్థాయిలో పనులను కొద్దిసేపు పరిశీలించారు. సమీక్ష సందర్భంగా డిజైన్లకు సంబంధించి అఫ్రీ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయని, ప్రతి నిర్మాణం వద్ద అనుకున్న ప్రకారం మెటీరియల్ వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నామని, అన్నీ నిర్దేశిత ప్రమాణాల మేరకే ఉన్నాయని వారు వివరించారు. ఈ సి ఆర్ ఎఫ్ డ్యామ్ నిర్మాణ సమయంలో డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నయో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేశారు. ఆ పరికరాల్లో పనుల్లో ఏమైనా తేడా ఉంటె నమోదు అవుతుంది. ఆ పరికరాలు నమోదు చేసిన రికార్డులను అంతర్జాతీయ నిపుణులకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అంద చేశారు. వాటిని పరిశీలించిన అధికారులు ఎలాంటి తేడాలు లేవని నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. గత మే నెలలో నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన సమయంలో ఇచ్చిన సూచనలు, సలహాలపై తీసుకున్న చర్యలను అధికారులు పాయింట్ల వారీగా వారికి వివరించారు. వారి వివరణ పట్ల నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

Leave A Reply

Your Email Id will not be published!