రాజకీయ పార్టీలకు సాఫ్ట్ కాపీని అందిస్తాం : సీఈసీ
కేంద్ర సర్కార్ కు, సీఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సర్ పై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇప్పటికే ఇండియా కూటమి ఆధ్వర్యంలో సర్ పై , సీఈసీని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించింది సుప్రీంకోర్టు. ఈమేరకు కేంద్ర సర్కార్ కు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీంతో దిగి వచ్చారు సీఈసీ. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీని సులభంగా చదవగలిగే ఫార్మాట్లో రాజకీయ పార్టీలకు అందించడానికి అంగీకరించింది. అనేక రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా యొక్క సాఫ్ట్ కాపీని సులభంగా చదవగలిగే ఫార్మాట్లో ఇవ్వాలని ఈసీఐని అభ్యర్థించాయి . కాంగ్రెస్ 2018లో ఇదే విషయాన్ని కోరుతూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
కానీ ఈసీఐ దానిని వ్యతిరేకించింది. సర్ లో కీలక మార్పులు చేయాలని సూచించింది. రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా యొక్క సాఫ్ట్ కాపీని సులభంగా చదవగలిగే ఫార్మాట్లో అందించడం. చేర్పులు, తొలగింపులు, మార్పుల జాబితాలను కూడా రాజకీయ పార్టీలతో పంచుకోవడం జరుగుతుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఓటర్ల జాబితా యొక్క సాఫ్ట్ కాపీని సులభంగా చదవగలిగే ఫార్మాట్లో పంచుకోవడం. వాదనలు , అభ్యంతరాల వారపు జాబితాను రాజకీయ పార్టీలతో పంచుకోవడం జరుగుతుంది. ఈసీఐలో ఇంకా చాలా సంస్కరణలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియ తయారీలో మరింత పారదర్శకత దిశగా ఇది మొదటి అడుగు పడిందని చెప్పక తప్పదు. మరో వైపు దేశ వ్యాప్తంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
