Sunburn Event : సన్ బర్న్ కు షాక్ కేసు నమోదు
ఈవెంట్ మేనేజర్ సుశాంత్ పై కేసు
Sunburn Event : హైదరాబాద్ – కొత్త ఏడాది సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్(Hyderabad) లో అనుమతి లేకుండా టికెట్స్ సేల్స్ కు తెర తీసిన సన్ బర్న్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు బిగ్ షాక్ తగిలింది. బుక్ మై షో ద్వారా భారీ ఎత్తున టికెట్లను విక్రయించింది. దీనిపై కన్నేసి ఉంచారు హైదరాబాద్ నగర పోలీసులు. ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
Sunburn Event Viral
డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సన్ బర్న్ పై కేసు నమోదు చేశారు. సన్ బర్న్ ఈవెంట్ మేనేజర్ సుశాంత్ పై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే సన్ బర్న్ ప్రతినిధులకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. అనుమతి లేకుండా టికెట్లు విక్రయించారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా గతంలో కూడా సన్ బర్న్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఆ సమయంలో ఈవెంట్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో యువతీ యువకులకు డ్రగ్స్ అందుబాటులో ఉంచినట్లు విమర్శలు ఉన్నాయి.
ఈవెంట్స్ పేరుతో పర్మిషన్స్ లేకుండా ఎవరైనా, ఏ సంస్థ అయినా టికెట్లు అమ్మినా లేదా ఈవెంట్స్ కు తెర లేపినా చర్యలు తప్పవని మరోసారి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
Also Read : Danasari Seethakka : ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం